KDP: మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పొద్దుటూరు పట్టణంలోని స్థానిక పశువైద్య కళాశాలలో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీస్ కళా జాగృతి బృందం నాటక ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.