KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మరణించిన కుటుంబాలకు PSR ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం ఇవాళ అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగదు అందజేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గత నెల సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 20 వరకు మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10,000 అందజేశారు.