SKLM: నందిగాం మండలంలో నేషనల్ హైవే నుంచి పెద్దలవునిపల్లికి వెళ్లే చెరువుగట్టు రహదారిలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఇవి మార్గాన్ని కప్పేయడంతో దీనిపై ఈ నెల 17న ‘రహదారిని మూసేస్తున్న పిచ్చిమొక్కలు’ అనే శీర్షికతో వే టూ న్యూస్లో కథనం ప్రచురితమైంది. పంచాయతీ అధికారులు స్పందించి జేసీబీ సహాయంతో బుధవారం పిచ్చి మొక్కలు తొలగించారు.