కోనసీమ: రానున్న రబీ సీజన్లో రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి నూతనవరి వంగడాలను, ఎగుమతికి ఉపయోగపడే సన్న రకాలు వరి వంగడాలను సాగు చేయించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు రబి సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. 1232, 1239 సన్న రకాలు వినియోగించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలన్నారు.