GNTR: వాతావరణ హెచ్చరికల మేరకు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పంటల రక్షణపై రైతులకు సూచనలివ్వాలని, ప్రజలు వాగులు దాటవద్దని హెచ్చరించారు.