ASF: జిల్లాలోని ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు విభిన్నమైనవని, భావితరాలకు తెలియజేసే విధంగా అభివృద్ధి చెందాలని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. బుధవారం కెరమెరి మండలం పెద్ద సాకడలో ఏర్పాటు చేసిన దండారీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనులతో పాటు గుస్సాడీలు, దండారీ బృందం సభ్యులతో కలిసి దండారి నృత్యం చేశారు.