E.G: కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద కార్తీక మాసం సందర్బంగా ఆలయ కమిటీ అధికారులతో కలిసి రాజానగరం MLA బత్తుల రామకృష్ణ బుధవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. లక్ష్మీనరసింహస్వామి కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించాలన్నారు.