సత్యసాయి: పెనుకొండ మండలం ఇస్లాపురం గ్రామంలోని మారుతి కాలనీలో పెనుకొండ టీడీపీ అధ్యక్షుడు శ్రీరాములు బుధవారం పర్యటించారు. గ్రామంలో ఒక విద్యుత్ స్తంభం శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్నట్లు కాలనీవాసులు తెలిపారు. శిథిలా వ్యవస్థలో ఉన్న స్తంభాన్ని తక్షణమే తొలగించి, పక్కనే ఉన్న సురక్షిత స్తంభానికి వైర్ కనెక్షన్ ఇవ్వాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు.