AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భీమవరం DSP జయసూర్య ఓ మంచి అధికారి. జయసూర్య గురించి పవన్ కళ్యాణ్‌కు ఎవరేం చెప్పారో నాకు తెలీదు. గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం అనేది సహజం. 13 ముక్కలాట నేరం కాదు.. కానీ పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కొంతకాలంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో.. పేకాట లాంటి జూదాలు జరగడం లేదు’ అని పేర్కొన్నారు.