AP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైసీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలో వైసీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గ చర్య. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తాం’ అని తెలిపారు.