JGL: భూ భారతి చట్టంపై జీపీవోలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో నూతన జీపీవోలకు విధులు, బాధ్యతలు, భూ భారతి చట్టంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్ఆర్, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, సాదా బైనామాల క్రమబద్దీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర వాటిపై జీపీఓలకు అవగాహన కల్పించారు.