GDWL: కేటిదొడ్డి మండల పరిధిలోని శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల జాతరలో భాగంగా నేడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవ వేడుకను ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.