SRD: ఆరోగ్య తెలంగాణనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పీఎస్ఆర్ గార్డెన్లో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పోలీసులు ధైర్య సహకాలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.