BHPL: జిల్లా కేంద్రంలో బుధవారం బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ పైడిపెల్లి రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ 42% బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఇందిరా పార్క్‌లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని రమేష్ పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సహకరించాలని ఆయన కోరారు.