ప్రకాశం: మైనంపాడులో జరిగిన SGF జిల్లా స్థాయి హాకీ సెలక్షన్లలో నాగులవరం జడ్పీ ఉన్నత పాఠశాలకి చెందిన 9 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్-14 విభాగంలో స్వరూప, త్రివేణి, హరిత, కార్తీక్, నవీన్, అండర్-17 విభాగంలో తేజేశ్వర్ రెడ్డి, మహీధర్, కరుణ, లక్ష్మి ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలు చిత్తూరు, కడప, నెల్లూరులో జరుగనున్నాయి.