AP: తుని గురుకుల పాఠశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచారయత్నంపై మంత్రి లోకేష్ స్పందించారు. ‘తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్ అయ్యాను. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తాం’ అని పేర్కొన్నారు.