RR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదని మున్నూరు కాపు సంఘం నేతలు స్పష్టం చేశారు. షాబాద్ మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందని ఆరోపించారు.