ELR: కొమరం భీమ్ జయంతిని పురస్కరించుకొని జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ స్వాతంత్య్ర కోసం పోరాడిన గొప్ప గిరిజన యోధుడు కొమరం భీమ్ త్యాగాలు స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన చూపిన మార్గంలో నేటి యువత నడవాలని తెలిపారు.