HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS అభ్యర్థికి షాక్ తగిలింది. మాగంటి గోపీనాథ్ కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తన తల్లి మాలినీదేవికి మాగంటి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదని, సునీత గోపీనాథ్‌తో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని, తనను చట్టబద్ధ భార్యగా తప్పుగా చూపారని ఆరోపించారు. ఆమె నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.