TG: ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెండేళ్లలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అధునాతన వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా ఆస్పత్రి చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.