KMR: దొంగతనాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, షీ టీమ్స్, రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసు కళాబృందం గాంధారిలోని బస్టాండ్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు అవగాహన కల్పించినట్లు పోలీస్ కళాబృందం సభ్యులు తెలిపారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.