W.G: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ AITUC ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ.. 2023 సంవత్సరంలో సమ్మె సందర్భంగా మున్సిపల్ ఉద్యోగుల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.