ADB: రైతుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ రైతు వేదికలో సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు రైతు వేదిక వద్ద కొమురం భీం జయంతి సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.