TG: కొమురం భీమ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొమురం భీమ్ ఎంతో పోరాడారని ఆయన కొనియాడారు. ‘జల్, జంగల్, జమీన్’ అనే నినాదంతో ఆయన చేసిన ఆత్మగౌరవ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తి నింపిందని కేసీఆర్ పేర్కొన్నారు.