NZB: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. ఇందులో కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్ ఉన్నారు.