E.G: పిఠాపురంలో జరుగుతున్న నేరాలపై దృష్టి సారించని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరంలో జూదాల కోసం డీఎస్పీ జయసూర్యపై సీరియస్ అవ్వటం హాస్యాస్పదమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. హోం మంత్రి అనిత శాఖనే పవన్ కళ్యాణ్ ఉద్దేశ్య పూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.