NZB: బాల్కొండ మండలం ఇత్వార్పేట్ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. 197 పశువులకు టీకాలు వేసినట్లు పశువైద్యాధికారి డా.గౌతమ్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. గాలికుంటు వ్యాధిపై పాడి రైతులకు అవగాహన కల్పించారు.