కెనడాలో ప్రముఖ పంజాబీ సింగర్ తేజి కహ్లాన్పై కాల్పులు జరిగాయి. ప్రత్యర్థి ముఠాలకు ఆయుధాలు, డబ్బు సరఫరా చేసి, ఇన్ఫార్మర్గా వ్యవహరించినందుకు ఆయనపై గ్యాంగ్స్టర్ రోహిత్ గొదారాకు చెందిన ముఠా దాడి చేసింది. అంతేకాదు ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చంపేస్తామని హెచ్చరించింది. కాగా, ప్రస్తుతం కహ్లాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.