అడిలైడ్ వేదికగా రేపు కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది. తొలి వన్డేలో ఓటమిపాలైన భారత్.. రెండో మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. అయితే, అడిలైడ్‌లో గత 17 ఏళ్లలో టీమిండియా ఓటమి చూడలేదు. అలాగే.. ఈ వేదికగా ఆడిన 15 మ్యాచుల్లో భారత్ 9 విజయాలు నమోదు చేసింది. దీంతో ఆ రికార్డును కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది.