NRML: కొమరం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుడుముదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య పిలుపునిచ్చారు. బుధవారం కొమరం భీమ్ 125వ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ తాగాలని వారు స్మరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జిల్లా నాయకులు పాల్గొన్నారు.