BDK: పినపాక మండలం గోపాల్ రావు పేట గ్రామంలో కూనారపు మోహన్ రావు కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం మోహన్ రావు దశదినకర్మలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.