KRNL: ఆస్పరి మండలం తంగరడోణ గ్రామంలో బుధవారం వర్షం సమయంలో పిడుగు పడడంతో రైతు ఉమాపతికి చెందిన ఒక ఎద్దు మృతి చెందింది. పొలం పనులు చేస్తుండగా చెట్టుకు కట్టిన రెండు ఎద్దులలో ఒకదానిపై పిడుగు పడడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో రైతుకు సుమారు రూ. 75,000 నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేయాలని రైతు కోరుతున్నారు.