TG: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ విచారణ ప్రారంభించింది. నిందితులు డా.నమ్రత, కళ్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణలను విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న వీరిని ఇవాళ్టి నుంచి ఈ నెల 28 వరకు అక్కడే ప్రశ్నించనున్నారు. నిందితులు అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఈడీ, కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకుంది.