KDP: వేంపల్లె గ్రామ పంచాయతీ సిబ్బందికి గత 7 నెలలకు సంబంధించి పెండింగ్ జీతాలను పంచాయతీ ఈవో నాగభూషణరెడ్డి అందజేశారు. విధులు నిర్వర్తిస్తున్న 104 మంది సిబ్బందికి మొత్తం రూ.23 లక్షలను సర్పంచ్ అనుమతితో చెల్లించారు. తమకు రావాల్సిన జీతాలను చెల్లించిన సందర్భంగా పంచాయతీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈవో, సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.