TG: జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన LHB బోగీలను కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుసంధానం చేయనున్నారు. కాచిగూడ నుంచి నాగర్‌కోయిల్ వెళ్లే(నెం.16353) రైలుకు డిసెంబర్ 14 నుంచి లింక్ హాఫ్మాన్ బుచ్ (LHB) బోగీలు అమర్చనున్నారు. ఇవి సాధారణ బోగీల కన్నా ఎక్కువ మంది ప్రయాణికుల సామర్థ్యంతో పాటు ప్రమాదాల సమయంలో సురక్షితంగా ఉంటాయని దక్షిణ రైల్వే ప్రకటించింది.