NRML: ఇటీవల నిర్మల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆమెడ శ్రీధర్, కార్యవర్గ సభ్యులు బుధవారం హైదరాబాద్లోని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాత గుప్తాను వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని చాలువాతో సన్మానించారు. జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఈ సందర్భంగా వారిని కోరారు.