NDL: కొలిమిగుండ్ల మండలం బెలుము గుహల వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుహల సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డికి రైట్ సైడ్ కాలు విరిగినట్లు స్థానికులు గుర్తించి గాయపడ్డ బాధితుడిని 108 అంబులెన్స్‌లో బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.