NLR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల్లో జిల్లాకు భారీ వర్షం సూచనల నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహాయ సహకారలు అందించాలని ఆయన కోరారు.