SDPT: వడ్లూరు గ్రామంలో బుధవారం కాలభైరవ స్వామి దేవస్థానం, కమాన్ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. తాజా మాజీ సర్పంచ్ నలవాల అనిత స్వామి, సంపత్ గ్రామ అభివృద్ధి పట్ల చూపుతున్న ఆసక్తి, సేవా తత్వం అందరినీ ఆకట్టుకుంది.