కోనసీమ: ఆలమూరు ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం ఒక కంటైనర్ లారీ చెట్టును ఢీకొట్టింది. మండపేట వైపు వెళ్తున్న భారీ కంటైనర్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో చెట్టు విరిగి పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.