బాపట్ల పట్టణంలోని పెద్ద మసీదులో నూతన డ్రైనేజీ నిర్మాణ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులుతో కలిసి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. త్వరితగతిగా డ్రైనేజీ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు వచ్చి ఇబ్బందులు తొలగిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.