NLG: నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో బుధవారం ప్రాజెక్ట్ అధికారులు తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువల ద్వారా 51,226 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587 అడుగుల వద్ద నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు.