W.G: కార్తీకమాసం మొదటి రోజులో భాగంగా బుధవారం పెనుగొండ శ్రీ కామాక్షి దేవి ఆలయంలోని శ్రీ ఉమా ఏకాంబరేశ్వర స్వామి వారి కార్తీక మాస నిత్య విశేష న్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం జరిగింది. పంచామృత ఫలరస సుగంధ ద్రవ్యములతో పాటు విశేషంగా చెరుకు రసంతో అభిషేకము, విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారిని భక్తులు దర్శించుకునే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.