మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో గురువారం న్యూజిలాండ్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు హర్మన్‌ప్రీత్ సేనకు ప్రాక్టీస్ చేసే వీలు లేకపోయింది. డీవై పాటిల్ స్టేడియంలో భారత జట్టు సాధన చేయాల్సి ఉండగా.. వర్షం వల్ల నెట్ సెషన్ సాధ్యపడలేదు. ఈరోజైనా వరుణుడు కరుణిస్తే వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయాలని టీమిండియా చూస్తోంది.