KMM: ముదిగొండ మండలం ముత్తారం గ్రామ రైతులకు అనేక ఏళ్లుగా పొలాలకు వెళ్లే సరైన రోడ్డు మార్గం లేక అవస్థలు పడ్డారు. విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లగా వారి చొరవతో 2 కిలో మీటర్ల వ్యవధి, రూ. 1.30 కోట్ల నిధుల వ్యయంతో రోడ్డు మంజూరు అవ్వగా బుధవారం కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వరరావుతో కలిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.