కార్తీక మాసంలో ఇంటిలోని పూజ గదిలో దీపం వెలుగుతూ ఉండాలి. ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది. ఈ మాసంలో ప్రతి రోజూ ఎవరైతే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి ఉసిరికాయ ఎంతో ఇష్టం. ఈ మాసంలో ఉసిరి దానం చేసినా.. ఈ చెట్టు కింద భోజనం చేసినా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.