VZM: జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు డెంకాడ మండలంలోని అక్కివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పదవతరగతి విద్య ప్రమాణాలను పరిశీలించి, వచ్చే సమ్మేటివ్ అసిస్టెంట్-1(ఎస్.ఏ-1) పరీక్షలకు విద్యార్థులు సమర్థవంతంగా అయ్యేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఆనంతరం పాఠశాల యొక్క అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు.