E.G: గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో (డ్వాక్రా) మండల సమైక్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అర్హులైన డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తామని స్పష్టం చేశారు.