HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. రేపు పార్టీ ఇన్ఛార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు కీలక నేతలు పాల్గొంటారు. ఉప ఎన్నికపై కార్యాచరణకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.