VSP: విశాఖకు గ్లోబల్ ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ పెట్టుబడితో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రైడెన్ ఇన్ఫోటెక్ దాదాపు రూ. 87,520 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.